- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ED raids: జార్ఖండ్, బెంగాల్‌లలో ఈడీ సోదాలు.. బంగ్లా చొరబాట్ల కేసులో చర్యలు
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జార్ఖండ్ (Jharkhand), పశ్చిమ బెంగాల్ (West bengal) రాష్ట్రాల్లో మంగళవారం సోదాలు చేపట్టింది. రెండు రాష్ట్రాల్లోని సుమారు 17 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. దాడుల్లో భాగంగా పలు నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్ పోర్టులు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్‌లోకి బంగ్లాదేశ్ మహిళల అక్రమ చొరబాటుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎంఎల్ ఏ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. బంగ్లాదేశ్ మహిళ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెలూన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళలను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా సోదాలు చేపట్టింది. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి రౌండ్ ఓటింగ్ బుధవారం ప్రారంభం జరగనుంది. అలాగే బెంగాల్ లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు సైతం ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఈడీ దాడులు జరగడం గమనార్హం. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఎన్నికల వేళ ఈడీ రెయిడ్స్ నిర్వహించిందని జేఎంఎం ఆరోపిస్తోంది.