- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Donald Trump: ఆరిజోనాలో ట్రంప్ విజయకేతనం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US presidential elections) భాగంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన ఆరిజోనాను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గెలుచుకున్నారు. ఆ రాష్ట్రంలోని 11 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ వశమయ్యాయి. దీంతో, ఆయనకు వచ్చిన ఓట్లు 312కు చేరాయి. కాగా.. అరిజోనా గెలుపుతో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. 2020 ఎన్నికల్లో డెమోక్రట్ల నుంచి ఆరిజోనాను గెలుచుకున్న వ్యక్తిగా జో బైడెన్ నిలిచారు. ఇకపోతే, జార్జియా(Georgia), పెన్సిల్వేనియా(Pennsylvania), మిచిగాన్(Michigan), విస్కాన్సిన్(Wisconsin), స్వింగ్ స్టేట్స్‌తో సహా 50 రాష్ట్రాల్లో సగానికి పైగా ప్రాంతాల్లో ట్రంప్‌ను విజేతగా తేల్చుతూ అమెరికా మీడియా ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు గత ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉన్న బైడెన్ కు ఓటు వేసాయి. అంతేకాకుండా, నార్త్ కరోలినా, నెవాడా వంటి సరిహద్దు రాష్ట్రాల్లోనూ ట్రంప్ గెలిచారు. పదవిలో ఉన్నప్పుడు నేరారోపణలు, రెండు అభిశంసనలు ఎదుర్కొన్నప్పటికీ ట్రంప్ ఈసారి అధిక ఓట్లను గెలుచుకున్నారు. 2016లో 304 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోగా.. ప్రస్తుతం ట్రంప్ కు 312 ఓట్లు పడ్డాయి. ఇకపోతే, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి.
ట్రంప్ 2.0
జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో, ఆయన పరిపాలనలో పదవులు ఎవరెవరికి కట్టబెట్టాల్లో ఇప్పట్నుంచే సమీకరించడం ప్రారంభించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా(White House chief of staff) తొలిసారిగా ఒక మహిళను నియమిస్తున్నట్లు ప్రకటించారు. 67 సూసీ వైల్స్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియామకం అయ్యారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) కు చోటు దక్కనుంది. అలానే మాజీ రాయబారి రిక్ గ్రెనెల్, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ చోటు దక్కించునే అవకాశాలు కన్పిస్తున్నాయి.