కరోనా ముందు స్థాయికి దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ

by S Gopi |
కరోనా ముందు స్థాయికి దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దె కరోనా ముందున్న స్థాయిని అధిగమిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. కొవిడ్‌కి పూర్వం ఇది 14.12 కోట్ల నుంచి 15-15.5 కోట్లకు చేరుకుంటుందని, ఇది 8-13 శాతం వృద్ధిని సాధించవచ్చని బుధవారం ప్రకటనలో ఇక్రా తెలిపింది. అంతేకాకుండా వచ్చే మరో రెండు ఆర్థిక సంవత్సరాల్లో విమానయాన రంగం నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలదని అభిప్రాయపడింది. ఇదే సమయంలో పరిశ్రమ సరఫరా సవాళ్లు, ఇంజిన్ వైఫల్య సమస్యల వల్ల కొంత ప్రతికూలతను కూడా చూడవచ్చని పేర్కొంది. దేశీయ విమానయాన పరిశ్రమ రేటింగ్‌ను స్థిరంగా కొనసాగించిన ఇక్రా, విమాన ప్రయాణీకుల రద్దీ, ఖర్చుల విష్యంలో పరిశ్రమ మెరుగ్గా రాణిస్తోందని తెలిపింది. ఇక, భారత విమానాల్లో అంతర్జాతీఅయ ప్రయాణీకుల రద్దీ గతేడాది కరోనా ముందు స్థాయిని దాటేసింది. రానున్న రోజుల్లో ఇది మరింత ఊపందుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ ఏడాదితో పాటు వచ్చే 2025లోనూ పరిశ్రమ రూ. 3000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల నికర నష్టాలను నమోదు చేయవచ్చని ఇక్రా పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed