- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Monalisa:ఆ మూవీ షూట్‌లో మెరిసిన మోనాలిసా.. ఎలా ఉందో తెలుసా?(వైరల్ ఫొటో)

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మోనాలిసా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఇండోర్‌కి చెందిన మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చి.. కుంభామేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో కొందరు యూట్యూబర్‌లు మోనాలిసాను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ తేనేకళ్ల బ్యూటీ ఓవర్‌నైట్‌లోనే పాపులర్ కావడం జరిగింది. ఇంకేముంది మోనాలిసాకు బాలీవుడ్‌లో సినిమా ఆఫర్ కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే.. తేనే కళ్ల సుందరి మోనాలిసా(Monalisa)కు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్(Photoshoot)లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటల్ ‘పరికర్మ’మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా వచ్చింది. ఈ క్రమంలో ఆకట్టుకునే కళ్లతో పాటు విలక్షణమైన మోనాలిసా ముఖ కవలికలు ఆ సినిమా యూనిట్‌ను ఆకట్టుకున్నాయి.
దీంతో ఆ మూవీ ఫొటో గ్రాఫర్(Photographer) సంజీత్ చౌదరి(Sanjith Chowdary) ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటో షూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో నటిస్తున్నారు. అయితే.. మోనాలిసా వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో నటించడం కోసం మేకప్ వేసుకుని వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే మోనాలిసా ప్రస్తుతం ముంబయి(Mumbai)లో ఉన్నట్లు తెలుస్తోంది.