బడ్జెట్‌ను సమర్పించే అవకాశం దక్కని ఆర్థిక మంత్రులు ఎవరంటే?

by D.Reddy |
బడ్జెట్‌ను సమర్పించే అవకాశం దక్కని ఆర్థిక మంత్రులు ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సాధారణంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారన్న సంగతి తెలిసిందే. అయితే, భారతదేశ చరిత్రలో ఇద్దరు ఆర్థిక మంత్రులకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశమే దక్కలేదు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరు? వారికి ఎందుకు ఈ అవకాశం దక్కలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

క్షితిజ్ చంద్ర నియోగి

1949లో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో క్షితిజ్ చంద్ర నియోగి తాత్కాలిక ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. కేసీ నియోగి సుప్రసిద్ధ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్‌గా కూడా పనిచేశారు. అయితే ఆర్థిక మంత్రిగా కేసీ నియోగి పదవీ కాలం కేవలం 35 రోజులు మాత్రమే కావడంతో బడ్జెట్‌ను సమర్పించలేకపోయారు.

హేమవతి నందన్ బహుగుణ

1979లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా హేమవతి నందన్ బహుగుణ బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఐదున్నర నెలలకే రాజకీయ గందరగోళం కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బహుగుణ కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కలేదు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed