నేవీ నూతన చీఫ్‌గా దినేష్ త్రిపాఠి బాధ్యతలు

by samatah |
నేవీ నూతన చీఫ్‌గా దినేష్ త్రిపాఠి బాధ్యతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళం నూతన చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేష్ త్రిపాఠికి 26వ నేవీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు చీఫ్‌గా ఉన్న హరికుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం త్రిపాఠిని నియమించింది. ఈ మేరకు ఈ నెల 19న అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన బాధ్యతలు చేపట్టారు. దినేష్ అంతకుముందు నేవీ వైస్ చీఫ్‌గా పదవిలో ఉన్నారు. 1985 జూలై 1న నౌకాదళంలోని ప్రవేశించిన త్రిపాఠి వివిధ హోదాల్లో పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. భారత నావికాదళం ప్రస్తుతం ఒక శక్తిగా అవతరించిందని కొనియాడారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ఆత్మ నిర్భర్ దిశగా నౌకాదళం చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తానని చెప్పారు. కొత్త సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.

Advertisement

Next Story