- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు: అయోధ్య వేడుకకు ఆహ్వానం
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకకు 55 దేశాల నుంచి రాయబారులు, ఎంపీలతో సహా 100 మంది ప్రముఖులను ఆహ్వానించినట్టు వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద్ తెలిపారు. అలాగే కొరియన్ రాణిని కూడా ఇన్వైట్ చేసినట్టు వెల్లడించారు. ఆహ్వానించబడిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బోట్స్వానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్, డొమినికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఫిజి, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, గయానా, హంగరీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, జమైకా, జపాన్, కెన్యా, కొరియా, మలేషియా తదితర దేశాలున్నాయి. విదేశీ ప్రతినిధులందరూ జనవరి 20న లక్నోకు చేరుకుంటారని ఆ తర్వాత 21వ తేదీ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారని చెప్పారు. పొగమంచు, వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దయ్యే ప్రమాదం ఉందని కాబట్టి ప్రతినిధులు వేడుకకు ముందే భారత్‌కు రావాలని సూచించారు. మరికొంత మందిని ఆహ్వానించాలని అనుకున్నామని, అయితే స్థలం తక్కువగా ఉండటంతో జాబితాను తగ్గించాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు మహా ఆలయ ప్రారంభోత్సవానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.