నిజమైన ప్రేమను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు.. ఏమిటా కేసు ?

by Hajipasha |
నిజమైన ప్రేమను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు.. ఏమిటా కేసు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘నిజమైన ప్రేమ’ను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. మైనర్‌ బాలికతో 2015లో పారిపోయిన ఒక వ్యక్తిపై నమోదైన అత్యాచారం, కిడ్నాప్‌ కేసులను న్యాయమూర్తి జస్టిస్ స్వరణ్‌కాంత్ శర్మ కొట్టివేశారు. ‘‘ప్రేమ జంటలలో ఒకరు లేదా ఇద్దరూ మైనర్లు కావచ్చు. ఇద్దరూ మేజర్లే కూడా అయి ఉండొచ్చు. అయితే చట్టం ద్వారా నిజమైన ప్రేమను అరికట్టలేం.. నియంత్రించలేం..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరిఫ్ ఖాన్ అనే వ్యక్తి ముస్లిం వర్గానికే చెందిన ఒక బాలికతో కలిసి 2015 సంవత్సరంలో పారిపోయాడు. ఆ వెంటనే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలిక తరఫు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అప్పటికే ఆరిఫ్ భార్య ఐదు నెలల గర్భవతి అని తేలింది.

మూడేళ్లపాటు ఆరిఫ్ ఖాన్ జైలులోనే..

దాదాపు మూడేళ్లపాటు ఆరిఫ్ ఖాన్ జైలులోనే ఉన్నాడు. చివరకు 2018 ఏప్రిల్‌లో అతడికి బెయిల్ లభించింది. అనంతరం వారికి మరో కుమార్తె కూడా కలిగింది. తాజాగా ఆరిఫ్ ఖాన్, అతడి భార్య (గతంలో మైనర్ బాలిక) ఢిల్లీ హైకోర్టులో పిిటిషన్లు వేశారు. ఇద్దరూ తమ వివాహ బంధాన్ని, ప్రేమ బంధాన్ని సమర్ధిస్తూ న్యాయవాదుల ద్వారా వాదన వినిపించారు. ఆరిఫ్‌తో వెళ్లిపోయిన సమయానికి బాలిక వయసు 18 ఏళ్లు నిండలేదని పోలీసులు అంటుంటే.. తనకు అప్పటికే 18 ఏళ్లు వచ్చాయని ఆరిఫ్ భార్య వాదించింది. దీంతో ఆరిఫ్‌‌పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఒకరినొకరు సమర్ధించుకుంటున్న ఆ ఇద్దరిదీ నిజమైన ప్రేమ అని స్పష్టం చేసింది.

Advertisement

Next Story