Delhi: ఢిల్లీలో భారీగా పడిపోయిన గాలి నాణ్యత.. 429కి చేరిన ఏక్యూఐ

by vinod kumar |
Delhi: ఢిల్లీలో భారీగా పడిపోయిన గాలి నాణ్యత.. 429కి చేరిన ఏక్యూఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం రోజు రోజుకూ ఎక్కువవుతోంది. ఎయిర్ పొల్యూషన్ (Air pollution) విపరీతంగా పెరిగిపోవడంతో నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఈ ఏడాది తొలిసారిగా బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 429గా నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరిలోకి వస్తుంది. అయితే మంగళవారం సాయంత్రం 334 ఉండగా కేవలం 24 గంటల వ్యవధిలోనే అధికంగా పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం, ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో 30 స్టేషన్లు తీవ్రమైన కేటగిరీలో గాలి నాణ్యతను సూచించాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత వరుసగా 14 రోజులు చాలా దారుణంగా పడిపోయిందని, వాహనాల ఉద్గారాలే కాలుష్యానికి అతిపెద్ద కారణమని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు వాయు కాలుష్యం ఎక్కవు అవుతుండటంతో పాఠశాలలను అత్యవసరంగా మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed