400 సీట్లు గెలిస్తే జ్ఞానవాపి, మధుర ఆలయాల నిర్మాణం: అసోం సీఎం బిస్వశర్మ

by samatah |
400 సీట్లు గెలిస్తే జ్ఞానవాపి, మధుర ఆలయాల నిర్మాణం: అసోం సీఎం బిస్వశర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటే మధురలో కృష్ణ జన్మభూమి ఆలయం, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని అసోం సీఎం హిమంత బిస్వశర్మ అన్నారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రాకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. లోక్‌సభలో 300 సీట్లు వచ్చిన తర్వాత బీజేపీ అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 400 సీట్లు గెలిస్తే జ్ఞానవాపి, మధుర ఆలయాలను నిర్మిస్తామని, దానిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

యూపీఏ హయాంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంశంపై పార్లమెంట్‌లో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కానీ మోడీ హయాంలో పీఓకే భారత్‌లో భాగం అవుతుందని చెప్పారు. ‘ కొద్ది రోజుల నుంచి, పీఏకే నుంచి అనేక చిత్రాలు వస్తున్నాయి. ప్రతిరోజూ అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి ప్రజలు తమ చేతుల్లో భారత జెండాలతో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అది చూసినప్పుడు, భారత్ లో విలీన ప్రక్రియ ప్రారంభమైనట్లు నాకు అనిపిస్తుంది. కాబట్టి 400 సీట్లలో బీజేపీని గెలిపిస్తే పీఓకే కూడా భారత్‌లో కలుస్తుంది’ అని తెలిపారు. అసోంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed