సెబీ చీఫ్ పై మరోసారి విరుచుకు పడిన కాంగ్రెస్

by M.Rajitha |
సెబీ చీఫ్ పై మరోసారి విరుచుకు పడిన కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్ : సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ మీద మరోసారి తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మాధబి సెబీ చీఫ్ గా ఉంటూనే.. ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వేతనం తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించారు. మాధబి సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉంటూ ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్ బ్యాంకుల నుండి వేతనాలు అందుకున్నారని.. ఇది సెబీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా 2017-2024 ఆమధ్య ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా మాధబి అందుకున్నారని, వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అసలు సెబీ చీఫ్ నియామకం మీదనే పలు అనుమానాలు ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెబీ చీఫ్ గత ఏడేళ్ళ పదవీ కాలంలో రూ.16 కోట్ల వేతనం అందుకున్నారని, మళ్ళీ ఇతర ప్రైవేట్ సంస్థల నుండి వెంతనం ఎలా పొందుతారని ప్రశ్నించారు. మాధబికి ఆయా బ్యాంకుల నుండి వేతనం అందుతుండటం వల్లే ఐసిఐసిఐ మీద విచారణలు నిలిచిపోయాయని అన్నారు.

Next Story

Most Viewed