- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం.. అందరినీ బయటకి లాక్కెళ్లిన మార్షల్స్

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాల్లో రెండో రోజు తీవ్ర గందరగోళం నెలకొంది.మంగళవారం ఉదయం అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగాన్ని ఆప్ (AAP) ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆప్ నేతలు ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో తమ నిరసన తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే చేతుల్లోని ప్లకార్డులు తీసుకోవాలని స్పీకర్ విజేందర్ గుప్తా మార్షల్స్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలను బయటకు కూడా పంపించారు. చివరకు మాజీ సీఎం ఆతిశీ సహా 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ (AAP MLAs suspended) చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదికను BJP ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 25) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని అధికార పార్టీ ఆరోపించింది. సీఎం కార్యాలయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, రాష్ట్రపతి, ప్రధానమంత్రుల చిత్ర పటాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ ఫొటోను విడుదల చేసింది.