Cm Yogi: మమతా బెనర్జీ వ్యాఖ్యలు సరికావు.. యూపీ సీఎం యోగీ ఫైర్

by vinod kumar |
Cm Yogi: మమతా బెనర్జీ వ్యాఖ్యలు సరికావు.. యూపీ సీఎం యోగీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మహాకుంభమేళాను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) చేసిన వ్యా్ఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithanath) తీవ్ర విమర్శలు గుప్పించారు. హోలీ సమయంలో హింసను నియంత్రించలేని వారు మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అని పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. గోరఖ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలిసారిగా తమిళనాడు నుంచి ప్రజలు మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చారని గుర్తు చేశారు. కేరళ నుంచి కూడా ప్రజలు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు. ఈ రాష్ట్రంలో హోలీ ప్రశాంతంగా ముగిసింది. కానీ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మాత్రం హోలీ సమయంలో అనేక అవాంతరాలు జరిగాయి. ప్రభుత్వం వీటిని నియంత్రించకపోవడం విడ్డూరంగా ఉంది’ అని తెలిపారు.

45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాలో ప్రతిరోజూ పశ్చిమ బెంగాల్ నుంచి 50,000 నుండి 1 లక్ష మంది వరకు పాల్గొన్నారన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులను మహా కుంభ్‌కు ఆహ్వానించడానికి తమ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు మంత్రులను పంపిందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హోలీ సందర్భంగా జరిగిన ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆకాష్ చౌదరి అలియాస్ అమర్, టిటాగఢ్‌లోని నివాసం సమీపంలో తన స్నేహితులతో హోలీ జరుపుకుంటుండగా ముగ్గురు నుంచి నలుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే యోగీ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story

Most Viewed