Cm shinde: ప్రతిపక్ష నాయకుడి పదవిపైనే ఉద్ధవ్ దృష్టి.. సీఎం షిండే విమర్శలు

by vinod kumar |
Cm shinde: ప్రతిపక్ష నాయకుడి పదవిపైనే ఉద్ధవ్ దృష్టి.. సీఎం షిండే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడి పదవిపైనే ఉద్ధవ్ ప్రస్తుతం దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. జల్నా జిల్లాలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్ధవ్ థాక్రే సీఎం కావడం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మిత్ర పక్షాలకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందే సీఎంను ప్రకటించాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తుంటే.. కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)లు మాత్రం దానికి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

థాక్రే ఒకప్పుడు సీఎం కావాలని కలలు కన్నారని.. కానీ ఇప్పుడు ఎంవీఏ కూటమి భాగస్వాములు కూడా ఆయనను ఆ స్థానంలో కోరుకోవడం లేదని విమర్శించారు. త్వరలోనే ఉద్ధవ్‌ను ప్రతిపక్ష నేత పదవి వరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా థాక్రే శివసేన, బాల్ థాశ్రే సిద్ధాంతాలను విడిచిపెట్టాడని ఆరోపించారు. మహాయుతి మళ్లీ అధికారంలోకి వస్తే మరఠ్వాడా ప్రాంతానికి వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తామని షిండే హామీ ఇచ్చారు. కాగా, మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed