- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టుడికిన అసెంబ్లీ.. సీఎం చేసిన ఆ పొరపాటు వల్ల సభలో గందరగోళం!
దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. సీఎం అశోక్‌గెహ్లాట్ చేసిన ఓ తప్పిదం వల్ల సభ అరగంట పాటు వాయిదా పడింది. శుక్రవారం ప్రారంభమైన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 2023-24 బడ్జెట్‌కు బదులుగా సీఎం గెహ్లాట్ గతేడాది బడ్జెట్‌లోని సారాంశాలను చదివారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతేడాదికి సంబంధించిన బడ్జెట్‌లో మొదటి రెండు ప్రకటనలు చేసిన వెంటనే, ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. ఒక్కసారిగా వెల్‌లోనికి ప్రవేశించి ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హడావిడి చేయడంతో బడ్జెట్ కాపీ లీక్ అయిందని, ఇది నాలుగైదు చేతుల్లోకి వెళ్లుంటుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ సింఘ్వి ఆరోపించారు. ఇక సీఎం కొత్త బడ్జెట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ సీఎం గెహ్లాట్ దాదాపు 6 నిమిషాల పాటు గతేడాది బడ్జెట్ ప్రసంగం చదివినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ సీపీ జోషీ సభను అరగంట పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం భాజపా ఎమ్మెల్యేలు వెల్‌లో బైఠాయించి నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను రద్దు చేయాలని స్పీకర్‌ను కోరారు.