Viral Video : బీహార్‌లో తాలిబన్ల పాలన! దొంగతనం చేశాడని మలద్వారంలో కారం కొట్టి చిత్రహింసలు

by Ramesh N |
Viral Video : బీహార్‌లో తాలిబన్ల పాలన! దొంగతనం చేశాడని మలద్వారంలో కారం కొట్టి చిత్రహింసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ ఓ అవమానవీయ ఘటన తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. బీహార్‌లోని అరారియాలో బైక్ చోరీకి పాల్పడినట్లు అనుమానంతో పట్టుబడిన వ్యక్తిని కొంత మంది వ్యక్తులు అతని రెండు చేతలను వెనక్కి కట్టివేశారు. తర్వాత అతని ప్యాంట్‌ను కిందకి లాగి, అతని మలద్వారంలో కారం పోసి దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో, తాజాగా అరారియా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరారియా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఇస్లాంనగర్ నివాసి మహమ్మద్ షిఫాత్‌ బైక్ చేసిన షిఫాత్ అనే వ్యక్తి బైక్ సదర్ ఆసుపత్రి వద్ద పార్క్ చేస్తే చోరీకి గురైంది. ఆ బైక్‌‌ను దొంగతనం చేసిన సిమ్రాహ నివాసిని మహమ్మద్ షిఫాత్‌, అతని సహచరులు పట్టుకొని చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. దొంగతనం ఆరోపణలపై యువకుడిని తాడుతో కట్టేసి, అతని ప్రైవేట్ భాగాలలో కారం పొడి వంటి పదార్ధాన్ని చొప్పించి అవమానవీయ చర్యకు కొందరు వ్యక్తులు పాల్పడ్డారని తెలిపింది.

షిఫాత్, ఇతర నిందితులపై అరారియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ వీడియోపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంగళవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బీహార్‌లో తాలిబాన్ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్‌లో బీజేపీ/ఎన్‌డీఏ సంతోషంగా అధికారంలో ఉందన్నారు. అందుకే కులతత్వ మీడియా మౌనంగా ఉందని విమర్శించారు. మేము, మా పార్టీ దళితులు, వెనుకబడిన, మైనారిటీల హక్కులు, వాటా గురించి మాట్లాడుతాము, అందుకే కుల వాసులు ఎల్లప్పుడూ మా పాలనను జంగిల్ రాజ్‌గా చూస్తారు.. అని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story