ప్రజలారా.. కాంగ్రెస్ మేనిఫెస్టోకు సలహాలివ్వండి : చిదంబరం

by Hajipasha |
ప్రజలారా.. కాంగ్రెస్ మేనిఫెస్టోకు సలహాలివ్వండి : చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజలు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చని పార్టీ మేనిఫెస్టో కమిటీ సారథి, సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు awaazbharatki.in పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించామని ఆయన చెప్పారు. [email protected] అనే ఈమెయిల్ చిరునామాకు కూడా ప్రజలు సూచనలను పంపొచ్చన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈవివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ కసరత్తును చేపట్టనున్నామని చిదంబరం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో వీలైనంత ఎక్కువమంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. awaazbharatki.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రజలు తమ సూచనలను వివిధ అంశాలవారీగా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. awaazbharatki.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను సమర్పించే క్రమంలో వారి పేర్లు, మొబైల్ నంబర్లు, పిన్ కోడ్‌లను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజాభిప్రాయం ప్రకారమే చేస్తుందని చిదంబరం స్పష్టం చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రియాంకాగాంధీ వాద్రా, టీఎస్ దేవ్ కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed