ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ చిదంబరం

by Disha Web Desk 17 |
ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'వారసత్వ పన్ను' అనే పదం మా మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించడం లేదని కానీ బీజేపీ నాయకులు, మోడీ కావాలనే మేనిఫెస్టోపై కల్పిత వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారు. పన్నులపై కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిష్పక్షపాత పన్ను పరిపాలనను అందిస్తామని చిదంబరం అన్నారు. మోడీ ప్రభుత్వం ద్వంద్వ 'సెస్'ను అంతం చేసి, దుకాణదారులకు, రిటైల్ వ్యాపారాలకు గణనీయమైన పన్ను మినహాయింపులు ప్రవేశపెడతామని ఆయన అన్నారు.

ప్రధాని ఊహాజనిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 'అసలు' అంశాలపై ఆయన చర్చించాలి" అని చిదంబరం అన్నారు. పదేళ్ల మోడీ పాలనలో వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛకు "తీవ్రమైన క్షీణత" జరుగుతోంది,"ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని" ప్రజలు కోరుతున్నారు. మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed