- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CRPF : సీఆర్‌పీఎఫ్ నూతన డీజీగా వితుల్ కుమార్
దిశ, నేషనల్ బ్యూరో : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా వితుల్ కుమార్(Vitul Kumar)ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీగా వ్యవహరిస్తున్న అనీష్ దయాల్ సింగ్ డిసెంబరు 31న రిటైర్ కాగానే వితుల్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని హోంశాఖ వెల్లడించింది. వితుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
ప్రస్తుతం ఆయన సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 1968 సంవత్సరం ఆగస్టు 3న పంజాబ్‌లోని భటిండాలో వితుల్ జన్మించారు. ఆయన ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్ చేశారు. 2009 ఫిబ్రవరి 9న సీఆర్‌పీఎఫ్ డీఐజీగా వితుల్‌కు పదోన్నతి లభించింది. 2012 డిసెంబరు 31న ఐజీగా, 2018 జనవరి 1న ఏడీజీగా పదోన్నతులు లభించాయి. 2024 సెప్టెంబరులో సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా వితుల్ నియమితులయ్యారు. ఆయన 2028 ఆగస్టు 31న రిటైర్ కానున్నారు.
Read More..
Priyanka Gandhi: డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో డబుల్ దౌర్జన్యాలు- ప్రియాంక గాంధీ