బిగ్ అలర్ట్.. నీట్ పరీక్ష రద్దుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2024-07-05 11:56:15.0  )
బిగ్ అలర్ట్.. నీట్ పరీక్ష రద్దుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పేపర్ లీక్ కావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు లేవని.. దీంతోనే ఈ పరీక్షను రద్దు చేయమని సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. నీట్ లీకేజ్ ఇష్యూ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించామని, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేసినట్లు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వారు నష్టపోతారని తెలిపింది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Next Story