Chief Justice of India: సీజేఐని కించపరిచేలా పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

by Shamantha N |   ( Updated:2024-09-11 10:32:42.0  )
Chief Justice of India: సీజేఐని కించపరిచేలా పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను కించపరిచేలా తప్పుడు వార్తలు ప్రసారం చేశారని బెంగాల కు చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్ అనే వ్యక్తి సీజేఐని కించపరిచేలా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. "ఉద్దేశపూర్వకంగా ప్రధాన న్యాయమూర్తి పరువుకు భంగం కలిగించేలా, సుప్రీంకోర్టు ప్రతిష్ట దెబ్బతీసేలా హల్దార్ వార్తలు ప్రసారం చేశారు. దీని వల్ల శాంతికిభంగం కలుగుతోంది” అని బెంగాల్ పోలీసులు సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.

ఇటీవలే కేసు నమోదు

ఇటీవలే, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం 500 రూపాయలు అడిగారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. కాగా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఢిల్లీ సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసింది. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.

Advertisement

Next Story