మేనిఫెస్టోను ఆయనకు వివరిస్తాం.. మోడీపై ఖర్గే కామెంట్స్

by Dishanational6 |
మేనిఫెస్టోను ఆయనకు వివరిస్తాం.. మోడీపై ఖర్గే కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ వివాదాస్పద వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున. తగినంత సమయం ఇస్తే.. మేనిఫెస్టోను తీసుకెళ్లి మోడీకి వివరిస్తానని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునర్విభజన చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలకు ఉన్నవారికి ఇస్తుందా..? అని ప్రశ్నించారు. అయితే, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని, సమాజాన్ని విభజించే ప్రయత్నాలను ప్రధాని ఆపాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ రోజు అన్నారు. కేరళలోని వయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరోపణలు ముస్లింలీగ్ ఆలోచనల్ని గుర్తుకు తెస్తున్నాయంటూ ఇటీవల జరిగి ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని అన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రజలు ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ముస్లింలకు పంచాలని కాంగ్రెస్ పనిచేస్తుందని కామెంట్స్ చేశారు. అది కాస్తా వివాదాస్పదమైంది. వారు మన సోదరీమణులు, తల్లుల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టారని మోడీ కామెంట్స్ చేశారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై వయనాడ్‌లో జరిగిన సభలో ఖర్గే స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని చెప్పారు ప్రధాని. మోడీ తగినంత సమయం ఇస్తే.. కాంగ్రెస్ మేనిఫెస్టోను తీసుకెళ్లి వివరిస్తామన్నారు. మేనిఫెస్టోలో ముస్లింకు మాత్రమే అని ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. పేదలు, యువత, రైతులు ప్రతీ ఒక్కరి కోసం మేనిఫెస్టోలో ఉందని అందాం. సమాజాన్ని విభజించేలా.. మోడీ హిందూ- ముస్లిం గురించి మాట్లాడుతున్నారన్నారు.

యువ న్యాయ్, నారీ శక్తి అనేవీ అందరికోసం.. కేవలం ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు, దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారికోసం కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని బీజేపీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

ఉపాధిహామీతో కాంగ్రెస్ దేశాన్ని పేదరికం వైపు తీసుకెళ్తుందని బీజేపీ తెలిపిందన్నారు. కానీ, ప్రధాని మోడీ, హోంమంత్రి వీటిని తీసేయలేదని అన్నారు. ప్రపంచంలో పర్యటిస్తున్నప్పటికీ, దేశంలోని మణిపూర్‌ని ఎందుకు సందర్శించలేదని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి, ప్రజల్ని ఓదార్చారని చెప్పారు. ప్రధాని మతతత్వ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.



Next Story

Most Viewed