- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Jharkhand : జార్ఖండ్ తొలి విడత పోల్స్‌కు.. ముగిసిన ప్రచార ఘట్టం
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనున్న 43 స్థానాల్లో ప్రచార ఘట్టం సోమవారంతో ముగిసింది. ఆయా స్థానాల్లో బుధవారం (నవంబరు 13న) పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 685 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 633 మంది అభ్యర్థులు 2019 అసెంబ్లీ పోల్స్(Assembly polls)లో పోటీ చేసిన వారే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకే ఈసారి కూడా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అత్యధికంగా 28 మంది అభ్యర్థులు జంషెడ్‌పూర్ పశ్చిమ స్థానంలో పోటీ చేస్తున్నారు. జగన్నాథ్‌పూర్ స్థానంలో కేవలం 8 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈనెల 20న రెండో విడత ఓటింగ్ జరగనున్న 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవంబరు 23న జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మహిళలు. రాష్ట్రంలో 29,562 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వాటిలో 24,520 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం.
2019 ఎన్నికల్లో ఏం జరిగింది ?
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్‌జేడీ కూటమి 47 సీట్లను గెల్చుకుంది. వీటిలో 30 సీట్లు జేఎంఎంకు, 16 సీట్లు కాంగ్రెస్‌కు, 1 సీటు ఆర్‌జేడీకి వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 25 సీట్లను మాత్రమే గెల్చుకుంది. దీంతో జేఎంఎం సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. జార్ఖండ్ వికాస్ మోర్చా (పి) 3 సీట్లు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2సీట్లు, సీపీఐ(ఎంఎల్), ఎన్‌సీపీ చెరొక సీటును గెల్చుకున్నాయి. ఈసారి బీజేపీతో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జేడీయూ, ఎల్‌జేపీ చేతులు కలిపాయి. 68 స్థానాల్లో బీజేపీ, 10 స్థానాల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, 2 స్థానాల్లో జేడీయూ, 1 స్థానంలో ఎల్‌జేపీ పోటీ చేస్తున్నాయి.