- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. ఆ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్న రాహుల్ గాంధీ
BREAKING: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. ఆ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్న రాహుల్ గాంధీ
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ వీడింది. ఈ మేరకు వయానాడ్‌తో సహా అమేథి నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. తుది వరకు ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని భావించినా.. ఏఐసీసీ ఎట్టకేలకు రాహుల్‌నే పోటీలో నిలిపింది. దీంతో ప్రియాంక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, అమేథి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, వయనాడ్‌లో 4,31,770 ఓట్ల మెజారిటీతో సమీప సీపీఎం అభ్యర్థి పీపీ సునీర్‌పై విజయం సాధించారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
Next Story