BREAKING: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొబైల్ బిల్లు రూ.5 వేలు పక్కా: త్రిపురలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొబైల్ బిల్లు రూ.5 వేలు పక్కా: త్రిపురలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన త్రిపురలో మాట్లాడుతూ.. జూన్ 4న రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నెల మొబైల్ బిల్లు రూ.5 వేలు వస్తుందని, అదే బీజేపీ హయాంలో నెల మొబైల్ బిల్లు రూ.400 మాత్రమే వస్తుందని అన్నారు. పదేళ్ల ఎన్టీఏ పాలనలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. దేశంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో దేశంలో ఈశాన్య భాగమైన త్రిపుర అభివృద్ధి కేంద్రం కృష్టి చేసిందని అన్నారు.

రాబోయే ఐదేళ్లలో పేద ప్రజలు, పిల్లలు ఆకలితో ఉండకుండా లబ్ధిదారులందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయనుందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారు అనారోగ్యం పాలైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా చికిత్స, మందుల ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా.. తాను దేశంలో సూర్యుడు మొదట ఉదయించే ఈశాన్య ప్రాంతాన్ని సందర్శిస్తున్నానని ప్రధాన మోడీ అన్నారు. అయోధ్యలోని ఓ గుడారంలో ఉన్న రామ్‌లల్లాను భవ్య మందిరాన్ని నిర్మించి ప్రతిష్టించామని పేర్కొన్నారు.

నేడు సూర్యకాంతి రామ్‌లల్లా తిలకం పడిన సుందర దృశ్యాన్ని తాను కూడా తిలకించి తరించానంటూ ప్రధాన మోడీ తెలిపారు. గత దశాబ్ధ కాలంలో 50 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించిన తొలి ప్రధాని తానేనంటూ మోడీ పేర్కొన్నారు. జాతీయ మ్యాప్‌లో త్రిపుర ఎక్కడ ఉందో కూడా చాలా మంది ప్రధానులకు తెలియదంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమ త్రిపుర, తూర్పు త్రిపుర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బిప్లబ్ కుమార్ దేబ్, కృతి సింగ్ దెబ్బర్మలకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed