Bomb threats: మరో 60 విమానాలకు బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ద్వారానే సమాచారం!

by vinod kumar |
Bomb threats: మరో 60 విమానాలకు బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ద్వారానే సమాచారం!
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాల బాంబు బెదింపులపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. సోమవారం మరో 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాకు (Air india) చెందిన 21, ఇండిగో(indigo)కు చెందిన 21, విస్తారా (vistara)కు చెందిన 20 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. విమానాల్లో బాంబు అమర్చినట్టు సోషల్ మీడియా (social media) ద్వారానే సమాచారం అందింది. అనంతరం వాటన్నింటినీ తనిఖీ చేసి కార్యకాపాలను నిర్వహించారు. తమ అనేక విమానాలకు సామాజిక మాద్యమాల ద్వారా వార్నింగ్స్ ఎదురయ్యాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌లను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని వెల్లడించారు. భద్రతా విధానాలన్ని అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, విమానయాన సంస్థలకు బూటకపు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఐటీ నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఐటీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశించింది. అయినప్పటికీ బెదిరింపులు ఆగకపోవడం గమనార్హం.

Advertisement
Next Story

Most Viewed