ఆ కారు సోరెన్‌ది కాదు.. సాహూది.. సాహూ ఎవరో తెలుసా ?

by Hajipasha |
ఆ కారు సోరెన్‌ది కాదు.. సాహూది.. సాహూ ఎవరో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌‌కు చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ఎవరిదనే దానిపై క్లారిటీ వచ్చింది. ఆ కారు హేమంత్‌ సోరెన్‌ది కాదని.. దాని ఓనర్ జార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు చెందిన కంపెనీ అని ఈడీ గుర్తించింది. దీంతో కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించారు. దీనిపై ఈడీ అధికారులు సాహూని ప్రశ్నించనున్నారు. గతేడాది డిసెంబర్‌లో ధీరజ్‌ సాహూ పేరు మీడియాలో మార్మోగింది. ఆయన కుటుంబానికి చెందిన సంస్థలపై జరిగిన ఐటీ రైడ్స్‌లో వందల కోట్ల రూపాయలు బయటపడటం సంచలనం సృష్టించింది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు 50 మంది సిబ్బంది, 40 కౌంటింగ్‌ మెషీన్లను వాడాల్సి వచ్చింది. నాలుగు రోజులపాటు లెక్కించగా రూ.350 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. ఒకేఒక ఐటీ రైడ్‌లో ఇంత పెద్దమొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోవడం దేశంలో అదే ప్రథమమని అప్పట్లో అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed