Kejriwal: కేజ్రీవాల్ పై బీజేపీ శీష్ మహల్ అస్త్ర ప్రయోగం !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-10 06:49:02.0  )
Kejriwal: కేజ్రీవాల్ పై బీజేపీ శీష్ మహల్ అస్త్ర ప్రయోగం !
X

దిశ, వెడ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తున్న కొద్ధి అధికార ఆమ్ఆద్మీ పార్టీ(Aam Aadmi Party), బీజేపీ(BJP)ల మధ్య పరస్పర విమర్శల దాడి ఉదృతమవుతోంది. ఆప్ పాలన వైఫల్యాలు లక్ష్యంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఆప్ పరస్పరం విమర్శల పర్వం వేడెక్కిస్తున్నాయి. తాజాగా ఆప్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ శీష్ మహల్(అద్దాల మహాల్)(Sheesh Mahal) అస్త్రాన్ని ప్రయోగించింది. సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ విలాసవంతంగా నిర్శించిన సీఎం బంగ్లా 'శీష్ మహల్' వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఆమ్ఆద్మీ నినాదం వినిపించే ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇంద్రభవనాన్ని తలపించేలా సీఎం బంగ్లాను నిర్మించిన తీరును తప్పుబడుతూ కేజ్రీవాల్‌ లక్ష్యంగా వీడియోలో విమర్శలు సంధించింది.

7 స్టార్ రిసార్టును తలపించేలా సీఎం భవంతిని నిర్మించారని.. సామాన్యుడిని అని చెబుతున్న కేజ్రీవాల్ కు రాజభవనాలు ఎందుకని బీజేపీ ప్రశ్నించింది. ఈ బంగ్లా రెనోవేషన్, రిపేర్లు, ఫర్నిఛర్ కోసం 45కోట్లు ఖర్చు చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఢిల్లీని లూటీ చేసి మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నల్లధనం, ప్రజల పన్నులతో శీష్ మహల్ కట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తాజాగా విమర్శలు చేశారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాగుతోన్న శీష్ మహాల్ ప్రచారం..ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ రుషికొండ ప్యాలెస్ మాదిరిగానే ఉందంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement

Next Story