- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ నవనీత్ కౌర్‌కు అమరావతి టికెట్
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఏడో జాబితాను బుధవారం విడుదల చేసింది. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి ప్రముఖ హీరోయిన్ నవనీత్ కౌర్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. కర్ణాటకలోని చిత్రదుర్గ స్థానం నుంచి గోవింద్ కార్జోల్‌ను బరిలోకిి దింపింది. నవనీత్ కౌర్ ప్రస్తుతం అమరావతి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్‌పై గెలిచారు. ఈసారి మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. ఇక కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. మాండ్య, హసన్, కోలార్ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించింది.
విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు హర్యానాలో ఉప ఎన్నిక జరిగే ఒక అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల్లో పంగి రాజారావు(అరకు), ఎమ్. శివకృష్ణం రాజు(అనపర్తి), సుజనా చౌదరి (విజయవాడ వెస్ట్), ఎన్.ఈశ్వర్ రావు (ఎచ్చర్ల), కామినేని శ్రీనివాసరావు(కైకలూరు), ఆదినారాయణ రెడ్డి (జమ్మల మడుగు), పీవీ పార్థసారథి (ఆదోని), వై.సత్యకుమార్ (ధర్మవరం), బొజ్జ రోషన్న ( బద్వేల్), విష్ణుకుమార్‌రాజు (విశాఖ నార్త్) ఉన్నారు. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ప్రకటించింది. నయాబ్ సైనీ ఈ నెల ప్రారంభంలోనే హర్యానా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.