- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశాలో బీజేపీ ప్రమాణ స్వీకారం వాయిదా
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన ఎన్నికల్లో 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా, ఇప్పుడు అది వాయిదా పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 10 నుండి జూన్ 12 వరకు రీషెడ్యూల్ చేసినట్లు పార్టీ నాయకులు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారం తన ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మరుసటి రోజు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల సమావేశం జూన్ 11 ఉండనుంది. మోడీ బిజీగా ఉండటం వలన ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, ఒడిశా కొత్త ముఖ్యమంత్రిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని, ఒడిశా పార్టీ యూనిట్ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శనివారం విలేకరులతో చెప్పారు. అలాగే సీఎం ఎవరో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాలని అన్నారు. జూన్ 10న ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు. కేంద్ర నాయకత్వం, మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా తేదీని మార్చాలని ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.