- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానం.. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) ఆరోపణలకు బీజేపీ(BJP) నేత షెహజాద్ పూనావాలా(Shehzad Poonawalla) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పూనావాలా మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని అన్నారు. ఈవీఎమ్‌లను హ్యాక్ చేయవచ్చని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం ఈవీఎమ్‌ల మీద ఆరోపణలు చేయలేదని విమర్శించారు.
ఓటమి అంచున నిలబడిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీని కాపాడేందుకు ఈవీఎమ్‌లపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మహరాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈవీఎమ్‌లపై దుమారం రేగుతోంది. ఈవీఎమ్‌లపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబడుతోంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ లేవనెత్తారు. తాజాగా.. రషీద్ అల్వీ వ్యాఖ్యలపై ఈసీ స్పందించి అనుమానాలను కొట్టిపారేసింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చి సమాధానం చెబుతానని వెల్లడించారు.