ముందు వెనకా యువతులను కూర్చోబెట్టుకుని బైక్ స్టంట్.. కేసు నమోదు (వీడియో)

by Sathputhe Rajesh |
ముందు వెనకా యువతులను కూర్చోబెట్టుకుని బైక్ స్టంట్.. కేసు నమోదు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడు తన బైక్ పై ముందొక యువతిని, వెనకాల మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్ చేశాడు. ఆ స్టంట్ ను వీడియో కూడా తీశాడు. బైక్ ముందటి వీల్ ను గాల్లోకి లేపాడు. బైక్ వెనక చక్రం మీదనే నడిపించాడు. ముందున్న యువతి ఆ బైకర్ ను హత్తుకుని కూర్చుంది. వెనకాల ఉన్న యువతి బైకర్ ను గట్టిగా పట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నెట్టింట చక్కర్లు కొడుతూ ముంబాయి పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బైక్ నడుపుతున్న సమయంలో ముగ్గురికి హెల్మెట్ లేకపోవడం గమనార్హం. ఈ వీడియోను ముంబై పోలీసులు ట్వీట్ చేసి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. బైక్ పై ఉన్న ముగ్గురిపై బీకేసీ పీఎస్ లో కేసు నమోదైంది.

Advertisement

Next Story