Bihar train accident: బిహార్ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే ఆదేశం

by Vinod kumar |
Bihar train accident: బిహార్ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే ఆదేశం
X

పాట్నా : బిహార్‌లోని బక్సర్ జిల్లాలో కామాఖ్య నార్త్‌ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి అస్సాంలోని తిన్‌సుకియా వైపు వెళ్తున్న కామాఖ్య నార్త్‌ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులోని ఆరు బోగీలు రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తీవ్ర విచారం వెలిబుచ్చారు.

Advertisement

Next Story