- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కూతురుకు ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి బెదిరింపులు!
by Vinod kumar |

X
న్యూయార్క్: ఖలిస్తానీ మద్దతుదారుల బెదిరింపుల సెగ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు తాకింది. యూఎస్‌లో చదువుకుంటున్న ఆయన కూతురుకు ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని ఢిల్లీ మహిళ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. మాన్ కూతురు సీరత్ కౌర్‌ను ఖలిస్తాన్ అనుకూల శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందనే కథనాల నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించాలని స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా ఇది పిరికి తనంతో కూడిన చర్య అని అభివర్ణించారు. స్వాతి మలివాల్ దీనిని 'తీవ్రమైన పిరికిపంద చర్య' అని అభివర్ణించారు. భగవంత్ మాన్ కుటుంబసభ్యులపై ఘెరవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు న్యాయవాది హర్మీత్ బ్రర్ ట్వీట్ చేశారు. పిల్లలను బెదిరింపులకు గురి చేయడం ద్వారా ఖలీస్తాన్ సాధిస్తారా అని ప్రశ్నించారు.
Next Story