Barder: భారత్ పాక్ సరిహద్దులో 1,450 కిలోమీటర్ల రోడ్డు.. ఆమోదం తెలిపిన కేంద్రం

by vinod kumar |
Barder: భారత్ పాక్ సరిహద్దులో 1,450 కిలోమీటర్ల రోడ్డు.. ఆమోదం తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు భద్రతను పెంచే దిశగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, పంజాబ్‌లోని ఇండో-పాక్ (india-pak) సరిహద్దు వెంబడి 1,450 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 4,500 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ కార్యక్రమం, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి చలనశీలతను మెరుగుర్చడం, సరిహద్దు అక్రమ రవాణా కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్‌లోని బార్మర్, జైసల్మేర్, బికనీర్, శ్రీగంగానగర్ వంటి కీలక సరిహద్దు జిల్లాలతో పాటు పంజాబ్‌లోని అనేక ప్రాంతాలను కవర్ చేస్తూ జీరో-లైన్ ఫెన్సింగ్‌కు ఆనుకుని రోడ్డు నిర్మించనున్నారు. రాజస్థాన్‌లో 1,096 కిలోమీటర్లు వేయనుండగా, పంజాబ్‌లో354 కిలోమిటర్ల రోడ్డు వేయనున్నట్లు బిస్‌ఎఫ్ అధికారి ఎంఎల్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం ఇసుక దిబ్బల కారణంగా బీఎస్ఎఫ్ సైనికులు సరిహద్దులో గస్తీ కాయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్త రోడ్లు వారికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అంతేగాక మాదకద్రవ్యాల రవాణాను సైతం అరికట్టొచ్చని చెబుతున్నారు.

Next Story

Most Viewed