Nirmala Sitharaman: బ్యాంకు రుణాలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. డిపాజిట్ల కోసం న్యూ స్కీమ్స్

by Prasad Jukanti |
Nirmala Sitharaman: బ్యాంకు రుణాలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. డిపాజిట్ల కోసం న్యూ స్కీమ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిపాజిట్ సమీకరణను పెంచడానికి వినూత్న, ఆకర్షణీయమైన పథకాలతో ముందుకురావాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పిలుపునిచ్చారు. డిపాజిట్లు, రుణాలు బండికి రెండు చక్రాల వంటివని, అయితే ప్రస్తుతం డిపాజిట్లు నెమ్మదించాయన్నారు. డిపాజిట్లు, రుణాల మధ్య అసమతుల్యతను అధిగమించడానికి, ప్రజల నుండి నిధులను సమీకరించడానికి ఆకర్షనీయమైన పథకాలు తీసుకురావాలని ఆమె సూచించారు. శనివారం ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇతర బోర్డు సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్యాంకులు, డిపాజిట్లను సమీకరించడం మరియు నిధులు అవసరమైన వారికి రుణాలు ఇచ్చే కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని ఆమె నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ వడ్డీ రేట్లపై నియంత్రణ ఎత్తివేశామని, నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు తరచూ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయని చెప్పారు. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed