కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ అధ్యాత్మిక కార్యక్రమం..

by Vinod kumar |
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ అధ్యాత్మిక కార్యక్రమం..
X

బెంగళూరు: కర్ణాటక వ్యాప్తంగా గురువారం హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం చేపట్టాలని బజరంగ్ దళ్ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. కుల, మతాల పేరుతో సమాజంలో శత్రుత్వాన్ని, ద్వేషాన్ని పెంచుతున్న వ్యక్తులపై, సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెప్పింది.

‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవి. మెజారిటీ, మైనార్టీల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని పెంచే వ్యక్తులు, బజరంగ్ దళ్ వంటి సంస్థలపై నిషేధం విధించడంతో పాటు చట్టం ప్రకారం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం’ అని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పింది. దీంతో కర్ణాటక వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించాలని బజరంగ్ దళ్ నిర్ణయించింది. ‘ధర్మం ప్రమాదంలో పడింది. మనమందరం కలిసి దానిని నిలబెట్టడమే ఏకైక మార్గం. విభేదాలను పక్కన పెట్టి ధర్మాన్ని రక్షించడానికి చేయి చేయి కలిపి ముందుకు రావాలి’ అని బీజేపీ రైట్ వింగ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి విశ్వహిందూ పరిషత్ కూడా మద్దతు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed