- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో దారుణం.. దొంగతనం ఆరోపణలతో మేనేజర్‌ను..
దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. యజమాని ఆదేశాల మేరకు మేనేజర్‌ను కొట్టి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. షాజాహన్‌పూర్‌లో బంకిమ్ సూరి అనే ట్రాన్స్‌పోర్టు వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరీ(32) అనే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
అయితే కన్హియా హోజరీకి చెందిన ఓ పార్సిల్ కనిపించడం లేదనే నెపంతో మేనేజర్‌పై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. దీంతో మేనేజర్ శివమ్‌పై కన్హియా హోజరీ కంపెనీ యాజమాని నీరజ్ గుప్తాతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని పోల్‌కు కట్టేసి రాడ్డుతో విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ క్రమంలో దెబ్బలు తట్టుకోలేక శివమ్ మృతి చెందడంతో అతని మృతదేహాన్ని మెడికల్ కాలేజీ ముందు మంగళవారం రాత్రి పడేశారు. అనంతరం కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. శివమ్ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మిస్సైన ప్యాకేజీ విషయంలో అనుమానం వచ్చిన ప్రతి ఉద్యోగిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు శివమ్‌ను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ కావడంతో కన్హయ్య షాపు ఓనర్ నీరజ్ గుప్తాతో పాటు మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
- Tags
- up
- manager murder