Atishi: క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం

by Shamantha N |
Atishi: క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అతిషి (Atishi) క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. తన పార్టీ పని, నిజాయితీ రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన డబ్బును ప్రజల నుంచి విరాళంగా పొందేందుకు ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేశారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ కోసం తనకు రూ.40 లక్షలు అవసరమని అతిషి తెలిపారు. సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళాల సహాయంతో ఆప్ ఎన్నికల్లో పోరాడిందని గుర్తుచేశారు. పార్టీ పని తీరు, నిజాయితీ రాజకీయాలను కొనసాగించడంలో ఇది సహాయపడిందని ఆమె అన్నారు. అంతేకాకుండా, ఓ ఒక వీడియో క్లిప్‌ను కూడా సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు మీరు మద్దతుగా నిలిచారు. మీ ఆశీస్సులు, మద్దతు లేకుండా ఇవేవీ సాధ్యం కాదు’ అని తన ప్రజలనుద్దేశించి అన్నారు. ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, సీఎం అతిషి (Atishi) తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసమే క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఇకపోతే, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story