డ్యాన్స్ చేసిన సీఎం ఆతిషి

by John Kora |
డ్యాన్స్ చేసిన సీఎం ఆతిషి
X

- సిగ్గులేని ప్రదర్శనగా అభివర్ణించిన స్వాతి మలివాల్

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి పాలైనా.. ఆ పార్టీ సీఎం ఆతిషి తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. కాల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆతిషి.. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిదూరిపై 3,521 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆతిషి విజయాన్ని ప్రకటించిన తర్వాత తన అనుచరులు, ఆప్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఆతిషి డ్యాన్స్‌ను 'సిగ్గులేని ప్రదర్శన'గా ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అభివర్ణించారు. ఇది సంబరాలు చేసుకునే సమయమా? అర్వింద్ కేజ్రివాల్ సహా పార్టీకి చెందిన సీనియర్లు అందరూ ఓడిపోయి.. ఆప్ అధికారం కోల్పోయిన సమయంలో ఆతిషి అలా డ్యాన్స్ చేయడం బాగాలేదని స్వాతి మండిపడ్డారు. ఇలా చేయాలని ఆతిషికి ఎందుకు అనిపించిందని స్వాతి ప్రశ్నించారు. కాగా, తన విజయం తర్వాత ఆతిషి మాట్లాడుతూ.. నా విజయం కోసం పని చేసిన బృందానికి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు.

Next Story

Most Viewed