- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assam DGP: 3 నెలల్లో ఫిట్‌గా మారితే సరే.. లేదంటే వీఆర్ఎస్సే
దిశ, డైనమిక్ బ్యూరో : లావుగా, ఫిట్‌నెస్ లేకుండా ఉన్న పోలీసులు 3 నెలల్లోగా ఫిట్‌గా మారాలని, లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని అస్సాం డీజీపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖలో సిబ్బంది ఫిట్‌నెస్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సీఎంవో సూచనలతో రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
కింది స్థాయి క్యాడెర్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ వర్తిస్తుందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర పోలీసులందరి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ను ప్రొఫెషనల్‌గా తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 15లోగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ను తగ్గించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఐపీఎస్ క్యాడర్‌కూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఆగస్టు 15 తర్వాత 15 రోజుల పాటు సిబ్బంది బీఎంఐ లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బీఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారికి మరో అవకాశం ఇస్తామని డీజీపీ చెప్పారు. అధిక బరువును వదిలించుకునేందుకు మరో మూడు నెలల సమయం ఇస్తామని వివరించారు.
అప్పటికీ బరువు తగ్గలేదంటే వాలంటరీ రిటర్మెంట్ స్కీమ్ కింద ఇంటికి పంపిచేస్తామని స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి పోలీస్ శాఖలో స్థూలకాయులు కనిపించొద్దని ఆదేశించారు. థైరాయిడ్ సమస్యతో పాటు అనారోగ్య కారణాలతో బరువు పెరిగిన వారికి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వివరించారు