- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Water Leaking : ట్రైన్‌లో వాటర్ ఫాల్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? రైల్వేశాఖకు ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాదిన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రైళ్లలో కూడా వర్షం నీరు రూఫ్ టాప్ ద్వారా లీక్ అవుతున్న ఘటనలు చూసి ఉంటారు. తాజాగా ఓ రైలులో వర్షం నీరు సీలింగ్ ద్వారా లీక్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మహారాష్ట్ర పరిధిలో మహానగర ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఓ కోచ్ లో ఒకవైపు వర్షపు నీరు లీక్ అవుతుంది.
దీంతో ప్రయాణికులు కూర్చున్న కొన్ని సీట్లు, లగేజీ తడిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్‌లో కొత్తగా ప్రయాణికుల కోసం వాటర్ ఫాల్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? మా లగేజ్ అంత తడిసిపోతుంది " అంటూ రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ 'ఎక్స్' వేదికగా ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో రైల్వే శాఖను విమర్శిస్తున్నారు.