APP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల కమిషనర్ కు కేజ్రీవాల్ సంచలన లేఖ

by Ramesh Goud |
APP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల కమిషనర్ కు కేజ్రీవాల్ సంచలన లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ నేత కేజ్రీవాల్ (AAP leader Kejriwal) ప్రధాన ఎన్నికల అధికారి (Chief Electoral Officer)కి సంచలన లేఖ (sensational letter) రాశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తల (BJP workers)పై ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) హోరు కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో.. ప్రచారాల జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ (AAP), బీజేపీ (BJP) నేతల మధ్య పిర్యాదుల పర్వం జరుగుతోంది.

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం (New Delhi Assembly constituency) అభ్యర్థి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యకర్తలపై ఎన్నికల కమిషనర్ (Election Commissioner)కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. ఈ లేఖలో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆప్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలు బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారిని వేధిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనిపై ఆయన.. "ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఢిల్లీ పోలీసుల (Delhi Police) చేతుల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మా అట్టడుగు వాలంటీర్లను బెదిరింపులు, వేధింపులకు గురిచేయడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

అలాగే నిన్న, మా సీనియర్ వాలంటీర్ చేతన్ (Chetan) (ప్రిన్సెస్ పార్క్ పార్ట్-2 నివాసి) తిలక్ మార్గ్‌లో BNSS, 2023లోని సెక్షన్ 126 కింద చట్టవిరుద్ధంగా నిర్బంధించబడ్డారని, అతనిపై కేసు బుక్ చేయబడిందని చెప్పారు.0 అతనిపై ఇంతకు ముందు కేసులు నమోదయ్యాయనే నిరాధారమైన, కల్పిత కారణాలతో పోలీసు స్టేషన్‌లో ఎప్పుడూ చేయని చర్యలకు పాల్పడ్డారని అన్నారు. అతను స్పృహ తప్పి పడిపోయాడని, తరువాత లేడీ హార్డింగ్ హాస్పిటల్‌కు తరలించబడ్డాడని తెలిపారు. అంతేగాక చాలా పోరాటం తర్వాత, అతన్ని సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్/ఎస్డీఎం (Returning Officer/SDM) ముందు హాజరుపరిచడంతో.. ఈ విషయంలో బెయిల్ (bail) మంజూరు చేశారని కేజ్రీవాల్ లేఖ ద్వారా తెలియజేశారు.

Next Story

Most Viewed