- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఇండియా’కు మరో షాక్.. ఒంటరి పోరుకు ఆ పార్టీ రెడీ !
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’కు షాక్ ఇచ్చేందుకు మరో పార్టీ రెడీ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సమాయత్తం అవుతోందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. ‘‘ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. మేం కూడా దానిపై చర్చిస్తాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని పీడీపీ నేత సుహైల్ బుఖారీ చెప్పారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా పీడీపీ ఇందుకు పూర్తి విరుద్ధమైన పోస్ట్ ఒకటి చేసింది. ఇండియా కూటమితో పీడీపీ రాజకీయ బంధాన్ని తెంచుకుంటుందనే ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లోనూ విపక్ష కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా, జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 6 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో సగానికి సగం (మూడు) స్థానాలు మాకంటే మాకు కేటాయించాలని ఇండియా కూటమిలోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కూటమిలోని పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదరలేదు.