- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక రాజకీయంలో అనూహ్య పరిణామం!
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈక్రమంలో అనూహ్యంగా కర్ణాటక ఎన్నికల బరిలో అన్నా డీఎంకే ఓపీఎస్ వర్గం ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతోంది. ఈ మేరకు శుక్రవారం ఓపీఎస్ వర్గానికి చెందిన నేత పుగజేంటి నేతృత్వంలో ఓపీఎస్ వర్గం టీమ్ కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పతో భేటీ అయ్యారు. తమిళులు ఎక్కువగా ఉండే ప్రాతంల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని యడ్యూరప్ప యడియూరప్పతో నేతలు చెప్పారు.
మైసూర్, మాండ్య, కోలార్, చామరాజనగర్ లో పోటీ చేయాలని భావిస్తున్నామని అందువల్ల తమ వర్గానికి టికెట్లు కేటాయించాలని కోరినట్లు ఈ మీటింగ్ అనంతరం నేతలు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్న వేళ అనూహ్యంగా తమిళ ఓట్లు చీలకుండా తమ అభ్యర్థులను బరిలోకి దించాలని ఓపీఎస్ వర్గం జరుపుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఓపీఎస్ ప్రతిపాదనను కమలనాధులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.