ప్రపంచంలోనే ఎత్తైన కంబాట్ ఎయిర్‌ఫీల్డ్.. చైనాకి ఊహించని కౌంటర్ ఇచ్చిన భారత్

by Vinod kumar |
ప్రపంచంలోనే ఎత్తైన కంబాట్ ఎయిర్‌ఫీల్డ్.. చైనాకి ఊహించని కౌంటర్ ఇచ్చిన భారత్
X

న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్‌లోని న్యోమా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కంబాట్ ఎయిర్‌ఫీల్డ్‌ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. న్యోమా ఎయిర్ ఫీల్డ్‌ను సెప్టెంబర్ 12న శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తూర్పు లద్ధాఖ్‌లోని న్యోమా బెల్ట్ వద్ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఈ ఎయిర్‌ ఫీల్డ్‌‌ను నిర్మిస్తుందని చెప్పారు.

ఇందుకోసం రూ.218 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి గత మూడేళ్లుగా తూర్పు లద్దాఖ్‌లోని న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ను భారత్ వాడుకుంటోంది. సైనిక బలగాలను, మెటీరియల్‌‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు దీన్ని ఉపయోగిస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఓ కంబాట్ ఫీల్డ్‌నే నిర్మించాలని ప్లాన్ చేస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed