- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్యాసింజర్లు.. ఏం చేశారంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విమానాల్లో ప్యాసింజర్స్ అనుచిత ప్రవర్తన వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇద్దరు ప్యాసింజర్లు ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్క చేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా గొడవకు దిగారు.
ప్యాసింజర్లను దత్తత్రేయ, జాన్ జార్జ్ డిసౌజాగా అధికారులు గుర్తించారు. వీరిపై ఫిర్యాదు అందడంతో ముంబైలో ఫ్లయిట్ ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వారు బెయిల్ పై విడుదలైనట్లు తెలిసింది. అయితే వీరిద్దరు ఏడాదిగా దుబాయ్ లో పనిచేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు గుర్తించారు. ఇంటికి వస్తూ మందుబాటిళ్లు కొని విమానంలో పార్టీ చేసుకుని తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే విమానంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఏడో సారి కావడం గమనార్హం.