Akhilesh Yadav: బీజేపీ పాలనలోనే జర్నలిస్టులపై దాడులు.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

by vinod kumar |
Akhilesh Yadav: బీజేపీ పాలనలోనే జర్నలిస్టులపై దాడులు.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ పాలనలో జర్నలిస్టులు(Journalists) అనేక దాడులకు గురవుతున్నారని సమాజ్ వాదీ పార్టీ(SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఫైర్ అయ్యారు. మీడియాను ఎదుర్కోలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తాజాగా ఓ జర్నలిస్టును పలువురు వ్యక్తులు బట్టలు విప్పి కొడుతున్న వీడియోను అఖిలేష్ ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రజల తరఫున పోరాడుతున్న జర్నలిస్టులపై అఘాయిత్యాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ‘జర్నలిస్టులను హత్య చేయడం, వారిని ఒత్తిడికి గురి చేయడం. అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌(Fir)లు నమోదు చేయడం. బట్టలు విప్పి కొట్టడం, వారితో ఇష్టం లేనివి తాగించడం వంటి అన్ని ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. జర్నలిస్టుల నైతిక విలువలను దెబ్బతీస్తు్న్నారని విమర్శించారు. బీజేపీ పాలనలోనే ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయని తెలిపారు. అయితే అఖిలేష్ పోస్టుపై పోలీసులు స్పందించారు. హమీర్ పూర్‌(Hameen poor)లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇటీవలే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed