ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!.. ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 5 |
ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!.. ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతున్నాయి.ఇప్పటికే వేగంగా గమ్యం చేరుకునేందుకు వాహానాలు, రైళ్లతో పాటు విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మరింత వేగంగా గమ్యస్తానాలకు చేరుకునేందుకు ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి రానున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. మరో రెండేళ్లలో ఇండియాలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా భారతదేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి.

పైలట్ తో పాటు ఐదుగురు వ్యక్తులు కూర్చునే ఈ ట్యాక్సీలో గంటకు 161 కిలోమీటర్ల వేగంతో ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రయాణించవచ్చని తెలిపారు. సాధరణంగా ఢిల్లీ నుంచి హర్యానాలోని గురుగ్రామ్ కు 32 కీలోమీటర్ల దూరానికి భూమిపై 90 నిమిషాల సమయం పడుతుండగా.. ఈ ఎయిర్ ట్యాక్సీ వల్ల కేవలం 7 నిమిషాల్లో చేరుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎయిర్ ట్యాక్సీ ధ్రువీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని, 2025 నాటికి సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆగమ్ గోల్డ్ స్టెయిన్ తెలిపాడు. సర్టిఫికేషన్ పూర్తి అయ్యాక ఇండియాలోనే అత్యంత రద్దీ నగరాలైన ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు మధ్య 200 ఎయిర్ ట్యాక్సీలతో సేవలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తొంది.



Next Story

Most Viewed