- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AICC: మెజారిటీలో రాహుల్‌ను క్రాస్ చేసిన ప్రియాంక గాంధీ
దిశ, వెబ్ డెస్క్: వయనాడ్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) మెజారిటీ(Majority)ని తన సోదరి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) దాటేసింది. వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికల(Wayanad Parliament By-Elections) ఫలితాల లెక్కింపు ముగిసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ(Huge Majority)తో విజయం(won) సాధించింది. ఆమెకు 3.82 లక్షల ఓట్ల భారీ మెజారిటీ లభించింది. దీంతో గతంలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీని క్రాస్ చేసినట్టు అయ్యింది.
ప్రతీ రౌండ్ లో ఆమెకు మెజారిటీ పెరుగుతూ వచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ ముగియడంతో 3.82 లక్షల మెజారిటీ వద్ద ఆమె గెలుపు ఖాయమైంది. దీంతో వయనాడ్ కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంకకు 5.78 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి(Communist Candidate Satyan Mokari) రెండవ స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్(BJP Candidate Navya Haridas) మూడవ స్థానంలో ఉన్నారు. Telugu News, Latest Telugu News, Telugu Latest news